
కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చేసింది. నిరుడు టీ20 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్‌లో నయా జోష్ నింపగా, ఈసారి మరికొన్ని మెగాటోర్నీలు అలరించబోతున్నాయి. మహిళల అండర్-19 ప్రపంచకప్‌తో మొదలై చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్స్, మహిళల వన్డే ప్రపంచకప్‌తో పతాకస్థాయికి చేరుకోనుంది.
కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చేసింది. నిరుడు టీ20 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్‌లో నయా జోష్ నింపగా, ఈసారి మరికొన్ని మెగాటోర్నీలు అలరించబోతున్నాయి. మహిళల అండర్-19 ప్రపంచకప్‌తో మొదలై చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్స్, మహిళల వన్డే ప్రపంచకప్‌తో పతాకస్థాయికి చేరుకోనుంది. తొలిసారి భారత్ వేదికగా ఖోఖో ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా, సాకర్ క్లబ్ వరల్డ్‌కప్, డైమండ్ లీగ్, ప్రపంచ టీటీ టోర్నీ రంజింపచేయనున్నాయి.
వీటికి తోడు ఐపీఎల్, ఐఎస్‌ఎల్, పీకేఎల్, బిగ్‌బాష్‌లీగ్, హండ్రెడ్ టోర్నీలు ఫ్యాన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లు, ఫార్ములావన్ పోటీలు, కుస్తీ పోరాటాలు.. ఇలా ఆట ఏదైనా మజా మాత్రం పక్కా. మరి ఇంకెందుకు ఆలస్యం షెడ్యూల్‌పై మనం ఒక లుక్కెద్దాం పదండి.