సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని తోటబావి కల్యాణ వేదిక వద్ద జరిగిన కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణం నిర్వహించగా, పట్టువస్ర్తాలు, ము త్యాల తలంబ్రాలను ఆలయవర్గాలు సమర్పించారు.

- వైభవంగా మల్లన్న కల్యాణ మహోత్సవం
- వేద మంత్రోచ్చరణలతోమార్మోగిన కొమురవెల్లి క్షేత్రం
- పట్టువస్ర్తాలు సమర్పించిన ఆలయవర్గాలు
- హాజరైన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి,
చేర్యాల, డిసెంబర్ 29: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని తోటబావి కల్యాణ వేదిక వద్ద జరిగిన కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణం నిర్వహించగా, పట్టువస్ర్తాలు, ము త్యాల తలంబ్రాలను ఆలయవర్గాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో స్వా మి వారి తరపున పడిగన్నగారి ఆంజనేయులు దంపతులు,అమ్మవార్ల తరపున మహదేవుని భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. గర్భగుడిలో జరిగిన కల్యాణోత్సవంలో అమ్మవారి తరపున మహాదేవుని రవి, స్వామి వారి తరపున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొన్నారు. స్వామి,అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకు లు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆల య పరిసరాల్లో ఊరేగించారు.