Perni Jayasudha | మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Perni Jayasudha | మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదట 185 మెట్రిక్ టన్నులు బియ్యం మాయం అయ్యాయంటూ అధికారులు 1.68కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బియ్యం బస్తాలు మాయమైనట్లుగా తేల్చారు. మొత్తం గోడౌన్ నుంచి 378 టన్నులు కనిపించడం లేదని గుర్తించారు.