- ‘అనుభవదారు’ కాలమ్ తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- భూ భారతి చట్టంతో మళ్లీ పహాణీల్లోకి పేర్లు
- గత అనుభవాలతో హడలిపోతున్న రైతులు
Bhu Bharathi | హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): అనుభవదారు కాలమ్.. ఈ పేరు వింటేనే రైతుల్లో గుబులు మొదలవుతుంది. ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులకు కాస్తు కాలమ్ అని చెప్తే హడలిపోతుంటారు. అనుభవదారు పేరుతో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కి.. కొంతకాలానికి భూ యజమానిగా మారి రైతులను రోడ్డున పడేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. పట్టా భూములకే కాదు ప్రభుత్వ, దేవాదాయ భూములకూ ఈ అనుభవదారు కాలమ్ పెద్ద శాపంగా మారేది. 2020 కొత్త ఆర్వోఆర్ చట్టంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ అనుభవదారు కాలమ్‌ను ఎత్తేసింది. దీంతో గుండెలమీద కుంపటి తొలిగినంత పనైందని లక్షలాది మంది రైతులు సంతోషం వ్యక్తంచేశారు. ఆ ఆనందం నాలుగేండ్లు కూడా నిలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ‘భూ భారతి’ పేరుతో తీసుకొస్తున్న కొత్త చట్టంలో అనుభవదారు కాలమ్‌ను చేర్చింది. పైగా 2014 వరకు రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్న వారి పేర్లను చేర్చుతామని ప్రకటిం