KT Rama Rao: 3D వ్యూహాంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్‌: కేటీఆర్

Photo of author

By admin

KT Rama Rao: రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం త్రీడీ వ్యూహాంతో ముందుకు వెళ్తున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. త్రీడీ(3D) వ్యూహం అంటే.. విధ్వంసం(డిస్ట్ర‌క్ష‌న్‌), దారిమ‌ళ్లింపు(డైవ‌ర్ష‌న్‌), దృష్టిమ‌ళ్లించ‌డం(డిస్‌ట్రాక్ష‌న్) అని ఆయ‌న పేర్కొన్నారు.

హైద‌రాబాద్: తెలంగాణ‌లో గ‌త ఏడాది కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం త్రీడీ వ్యూహాంతో ముందుకు వెళ్తున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KT Rama Rao) విమ‌ర్శించారు. త్రీడీ(3D) వ్యూహం అంటే.. విధ్వంసం(డిస్ట్ర‌క్ష‌న్‌), దారిమ‌ళ్లింపు(డైవ‌ర్ష‌న్‌), దృష్టిమ‌ళ్లించ‌డం(డిస్‌ట్రాక్ష‌న్) అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఐడియాలజీతోనే రేవంత్ ప్ర‌భుత్వం రాజ‌కీయ ప్ర‌తీకారానికి తెగించింద‌న్నారు. ఆ నెపంతోనే త‌మ‌పై కేసులు పెట్టిన‌ట్లు కేటీఆర్ ఆరోపించారు. కానీ ఏ ఒక్క కేసులోనే ప‌స లేద‌న్నారు. అన్ని ఉత్తుత్తి కేసులు పెట్టి, న్యాయాన్ని అపహాస్యం చేస్తున్న‌ట్లు విమ‌ర్శించారు.

Leave a Comment